గోదావరి గట్టు మీద కొత్త పుట్టిల్లు కోసం బాబు వెతుకులాట….

గోదావరి గట్టు మీద కొత్త పుట్టిల్లు కోసం బాబు వెతుకులాట….

చంద్రబాబు గారు మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. 1975లో, ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో చేరారు యువతకు 20% కోటా కింద, 1978 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గానికి MLA అయ్యారు. ఆయన మొదట్లో A.P స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం టి.అంజయ్య ప్రభుత్వంలో మంత్రిగా నియమితులయ్యారు. 1980 మరియు 1983 మధ్య, నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్కైవ్స్, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు మైనర్ ఇరిగేషన్‌తో సహా వివిధ శాఖలను నిర్వహించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ప్రస్తుత టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కెరీర్ లో ముచ్చటగా మూడోసారి తాను పోటీ చేసే నియోజకవర్గని మార్చుతున్నారు.ఆయన రాజకీయాలకు వచ్చిన కొత్తలో 1978లో తొలిసారిగా చంద్రగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు.1983లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు.. 1985 ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు.ఆ తర్వాత 1989 నుంచి 2019 ఎన్నికలకు వరకు వరుసగా కుప్పం నుంచి పోటీ చేస్తూ ఓటమి లేకుండా అప్రతిహతంగా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు.కానీ బాబు గారు ఈసారి రూట్ కొంచం మార్చారు అంట. మార్పు ఏంటి అంటే కుప్పంతో పాటు గోదావరి జిల్లా లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కూడా పోటీ చెయ్యాలి అని బాబు ఆలోచిస్తున్నారు అంట దానికి ప్రధాన కారణం కార్యకర్తల్లో ఉత్సాహం కోసం అని తెలుగు తమ్ముళ్లు బయటకి చెప్పుతున్న బయటకి చెప్పుకోలేని కారణాలు కూడా ఉన్నాయి అంట. ప్రధాన కారణాలలో ఒకటి జగన్ గారు కుప్పం అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఉదాహరణ కి 8 గ్రామ పంచాయితీలు కలిపి కుప్పం ని మున్సిపాలిటీ గ చెయ్యడం మరియు మీరు భరత్‌ని గెలిపిస్తే అతన్ని మంత్రిని చేస్తాను అంటూ జగన్ మాట ఇవ్వడం లాంటివి ఐతే మరో ప్రధాన కారణం వయసు మీద పడటం మరియు నారా లోకేష్ నాయకత్వం మీద కార్యకర్తలకు నమ్మకం లేక పార్టీ క్యాడర్ అంత జనసేన వైపు చూడటం ఒకటి అంతే కాకుండా 2019 వరకు అధికారం లో ఉన్న కూడా 2019 ఎన్నికల్లో సునామీలో బాబు కి కేవలం 8000 వోట్లు మెజారిటీ రాగ ఈసారి కుప్పం మున్సిపాలిటీలో సైతం ఓడిపోయింది టీడీపీకి ఇంత వ్యతిరేకత ఉండటం వలన ఈసారి పోటీ చేస్తే కేవలం 1000 నుంచి 3000 మెజారిటీ మాత్రమే వస్తుంది అని ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందుకున్న బాబు గారు రెండు చోట్లు పోటీ చేసి ఏదో ఒక విధంగా గెలిస్తే రెండు చోట్ల గెలిస్తే తక్కువా మెజారిటీ వచ్చింది అనే అపవాద పోతుంది ఏమో అని కూడా సమాచారం.