తెలుగునాట 'నవరస నటనా సార్వభౌమ'గా పేరుపొందారు.

కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న కృష్ణాజిల్లాలోని గూడూరు తాలుకాకి చెందిన కౌతవరం గ్రామంలో జన్మించారు. గుడ్లవల్లేరులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన సత్యనారాయణ.. విజయవాడలో ఇంటర్మీడియట్, గుడివాడ కళాశాలలో డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే నాటకాల మీద ఆసక్తి ఉండడంతో.. పలు నాటకాల్లో కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ వేషాలు వేశారు. మరోవైపు.. డిగ్రీ పూర్తిచేసినా సరైన ఉద్యోగం లేకపోవడంతో, తన కుటుంబానికి చెందిన కలప వ్యాపారం చూసుకున్నారు. అదేసమయంలో.. తన స్నేహితుడి సలహా మేరకు


 శృంగారం, హాస్యం, వీరం, కరుణ, అద్భుతం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం.. ఇలా నవరసాలను అలవోకగా పలికించే నటులు కొంతమందే ఉంటారు. వారిలో కైకాల సత్యనారాయణ ముందు వరుసలో ఉంటారు.  ఆరు దశాబ్దాల చిత్ర ప్రయాణంలో దాదాపు 800 సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న ఆయన.. తెలుగునాట 'నవరస నటనా సార్వభౌమ'గా పేరుపొందారు. అంతేకాదు..  సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రక.. ఇలా అన్ని రకాల జోనర్స్ లోనూ అభినయించి ఆకట్టుకున్న వైనం కైకాల సత్యనారాయణ సొంతం. అదేవిధంగా తెలుగు తెరపై యమధర్మరాజు పాత్రలకు చిరునామాగానూ నిలిచారాయన.  అలాంటి కైకాల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీకోసం