యూసీసీపై కలిసి ఆలోచిద్దాం…


 

యూసీసీపై కలిసి ఆలోచిద్దాం…

ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్(Chief Minister YS Jagan Mohan Reddy) కీలక సమావేశం(Key Meeting) నిర్వహించారు. ముస్లిం మైనారిటీలలో(Muslim Minorities) ఉన్న సందేహాలను నివృత్తి(Doubts Clarification) చేసేందుకు పూనుకున్నారు. యూసీసీపై ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, ఈ ప్రభుత్వం(Our Government) మైనార్టీ ప్రభుత్వమని భరోసానిచ్చారు. 

ఆందోళన వద్దు.. నేనున్నా

‘ఉమ్మడి పౌరస్మృతి(Uniform Civil Code) అంశంమీద డ్రాఫ్ట్‌(Draft) అనేది ఇప్పటివరకూ రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కాని మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోంది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదు.

ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రొపగండా నడుస్తోందని, ఇలాంటి దాన్ని మత పెద్దలుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రైనా, ఏతల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారని, మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీలేదనే విషయాన్ని మన అంతా స్పష్టం చేద్దామని సూచించారు.

అనేక మతాలు, అనేక కులాలతో విభిన్నమైనది మన భారతదేశం 

భారతదేశం చాలా విభిన్నమైనదని, ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయని, ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. వారివారి మత గ్రంధాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్‌ లాబోర్డులు ఉన్నాయన్నారు. ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్‌ లాబోర్డుల ద్వారానే చేయాలని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వాటిమీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి అని వివరించారు. ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్‌ లాబోర్డ్స్‌తో మమేకమై, వారి పర్సనల్‌ లా బోర్డ్స్‌ ద్వారా ఒకవేళ మార్పులు అవసరమైతే జరగాలి తప్ప వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న మన దేశంలో తగదని సీఎం జగన్ స్పష్టం చేశారు.