ఇది తెలుసుకుంటే మీరు మీ మార్గాన్ని సులభంగా కనుగొన వచ్చు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారు. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు రూట్స్, హోటల్స్, వెళ్లాల్సిన ప్రాంతాలు, ట్రాఫిక్ వివరాలు ఇలా ఎన్నో విషయాలు కనుగొనడానికి Google Maps పైనే ఆధారపడుతారు. కానీ కొన్నిసార్లు మనం వెళ్లాలనుకున్న ప్రాంతం గురించి కనుక్కున్న తర్వాత కూడా మ్యాప్‌లో కనిపించే రేఖలు, రంగుల అర్థాన్ని గురించి తెలుసుకోలేకపోవడం వల్ల డెస్టినేషన్ చేరుకునేందుకు ఆలస్యం కావచ్చు. ఇది తెలుసుకుంటే మీరు మీ మార్గాన్ని సులభంగా కనుగొన వచ్చు.
గూగుల్ మ్యాప్స్ లో ఏయే రంగులు ఉంటాయి
గూగుల్ మ్యాప్స్ లో నీలం, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మొదలైన అనేక రంగుల రేఖలు కనిపిస్తాయి. ఈ రేఖలు, రంగులకు ప్రత్యేక అర్థం ఉంటుంది. ఇవి కొన్నిసార్లు ట్రాఫిక్, మరి కొన్నిసార్లు రోడ్లు, ఇంకొన్నిసార్లు అడవులు లేదా నీటిని చూపుతాయి. ఒక్కో రంగుకి గల అర్థం ఏంటే తెలుసుకుంటే Google Maps ని వీక్షించడం సులభమవుతుంధి.
నీలం రంగు: నీలం రంగు మీరు వెళ్లాల్సిన మార్గాన్ని సూచిస్తుంది. ముదురు నీలం రంగులో ఉంటే మీరు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా హాయిగా వెళ్ళవచ్చు. లేత నీలం రంగు నదులు, సరస్సులు, సముద్రాలు మొదలైన నీటి వనరులను చూపిస్తుంది.
ఎరుపు రంగు: ఎరుపు రంగు ట్రాఫిక్ జామ్‌ను సూచిస్తుంది. రోడ్డు ఎర్రగా కనిపిస్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని అర్థం. ముదురు ఎరుపు రంగులో ఉంటే ట్రాఫిక్ జామ్ కావచ్చు. అలాంటప్పుడు గమ్యం చేరుకునేందుకు ఇతర మార్గాలను వెతకడం మంచిది.
ఆకుపచ్చ రంగు: ఆకుపచ్చ రంగు అడవులు, తోటలు, జాతీయ ఉద్యానవనాలు లేదా పచ్చని ప్రాంతాలను సూచిస్తుంది. కొన్నిసార్లు ట్రాఫిక్ లేకుండా రోడ్డుపై సాఫీగా ప్రయాణం చేయవచ్చని కూడా ఈ రంగు సూచిస్తుంది.
నలుపు, బూడిద రంగులు: మూసివేసిన రోడ్లు లేదా ప్రమాద స్థలాలను నలుపు లేదా బూడిద రంగులు సూచిస్తాయి. ఈ రంగులు ఉంటే మార్గం క్లోజ్ చేసి ఉండవచ్చు లేదా ట్రాఫిక్ కారణంగా బయటపడటానికి దారి లేకపోవచ్చు.
పసుపు రంగు: పసుపు రంగు ప్రధాన రహదారిని సూచిస్తుంది. ఇది ట్రాఫిక్ తక్కువగా ఉండే పెద్ద రహదారి. ఎక్కువ రద్దీ లేకపోయినా డెస్టినేషన్ చేరుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు.
మీరు ఒక ప్రదేశానికి త్వరగా చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తుంటే అప్పుడు నీలం లేదా ఆకుపచ్చ రంగుల్లో కనిపించే రూట్లను ఎంచుకోండి. ఇక పసుపు రంగు రోడ్డులో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. ఎరుపు, నలుపు రోడ్లు చాలా రద్దీగా ఉంటాయి కాబట్టి ఆ మార్గాల్లో వెళ్లేందుకు ప్రయత్నించకండి.
ఇంతవరకు తెలుసుకున్నట్లైతే, Google Maps లో కనిపించే రంగుల అర్థం మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈ రంగులను సరైన విధంగా అర్థం చేసుకుని ఉపయోగించగలిగితే, మీరు ఎలాంటి ఆందోళన లేకుండా, సమయాన్ని వృథా చేయకుండా, మీ గమ్య స్థానాన్ని సులభంగా చేరుకోగలుగుతారు.
Google Maps ను కేవలం దిశల కోసం కాకుండా, ట్రాఫిక్ వివరాలు, రహదారి పరిస్థితులు తెలుసుకునే హేతువు గాను వినియోగించండి. రంగుల అర్థం తెలుసుకుని, అవి ఇచ్చే సమాచారం ప్రకారం నిర్ణయం తీసుకుంటే మీరు మార్గం తప్పకుండా, గమ్యానికి వేగంగా చేరుకోగలుగుతారు.
