తన స్వంత రికార్డును తానే అధిగమించిన జస్టిస్‌ రుద్ర ప్రకాశ్ మిశ్రా

ఒకే రోజులో అత్యధిక కేసుల విచారణ పూర్తి చేసి పట్నా హైకోర్టు చరిత్రలో మరో విశేష ఘట్టాన్ని నమోదు చేసింది.వాటిలో మద్యం నిషేధ చట్టంతో పాటు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న మొత్తం 510 కేసులు ఉన్నాయి. జస్టిస్‌ రుద్ర ప్రకాశ్ మిశ్రా ఈ కేసులన్నీ ఒక్క రోజులోనే విచారించి తీర్పులు లేదా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒకే రోజులో దాదాపు 500 కేసులు విచారించిన తన స్వంత రికార్డును ఆయనే అధిగమించారు.

ఇటీవల ఒకే రోజుకు లిస్టింగ్‌ అయిన 210 కేసులను జస్టిస్‌ మిశ్రా పరిశీలించారు. సగటున ప్రతి కేసును అర నిమిషంలోనే పూర్తి చేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. న్యాయవాదులు హాజరుకాని కేసులను వాయిదా వేయగా, న్యాయవాదులు హాజరైన 475 కేసులపై విచారణ సాగింది. ఈ కేసుల్లో ఎక్కువ భాగం ఎక్సైజ్‌ చట్టం కింద నమోదై విచారణ దశలో ఉన్నవేనని సమాచారం. వాటిలో సుమారు 90 శాతం కేసులకు బెయిల్‌ మంజూరు చేయడం గమనార్హం.

వేగవంతమైన విచారణ, సమర్థవంతమైన పనితీరుతో న్యాయవ్యవస్థపై భారం తగ్గిస్తున్న జస్టిస్‌ మిశ్రా పనితీరును న్యాయవాదులు, న్యాయవర్గాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి.